Anushka: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  అందాల అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న 'భాగమతి' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలిపింది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
*  ఇటీవల 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రాన్ని రూపొందించిన హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ గా చేయనున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం కోసం 'దాగుడు మూతలు' అనే టైటిల్ని రిజిస్టర్ చేశారు. ఇందులో నటించే హీరోలెవరన్నది త్వరలో ప్రకటిస్తారు.
*  అల్లరి నరేశ్ నటిస్తున్న 'మేడ మీద అబ్బాయి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'ఒరు వడక్కం సెల్ఫీ' అనే మలయాళ చిత్రంకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల విమల్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.        
*  రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'లండన్ బాబులు' చిత్రానికి సంబంధించిన ఓ పాటను నిన్న విడుదల చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటను రిలీజ్ చేశారు. యువ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

More Telugu News