allu arjun: భారీ రేటుకు 'నా పేరు సూర్య' శాటిలైట్ రైట్స్!

వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ .. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుని రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

విశేషమేంటంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుకాక మునుపే శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు కావడం. 'జీ తెలుగు' ఛానెల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 10 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శరత్ కుమార్ విలన్ గా నటిస్తుండటం విశేషం. బన్నీ నుంచి ఇంతకు ముందు వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా ఈ ఛానల్ వారే దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

More Telugu News