raviteja: 'రాజా ది గ్రేట్' టీజర్ అదరగొట్టేస్తోంది!

రవితేజ తాజా చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నాడు. రవితేజ కెరియర్లో ఈ తరహా పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

 " నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి" అంటూ ఎమోషన్ తో రాధిక చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. ''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్, ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
 

More Telugu News