: జాతీయ గీతం ఆలపించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు.. మదర్సాలను హెచ్చరించిన యూపీ ప్రభుత్వం!

స్వాతంత్ర్య దినోత్సవం రోజున మదర్సాలలో జాతీయ గీతాన్ని ఆలపించి, దానిని వీడియో రికార్డింగ్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు బరేలీ డివిజనల్ కమిషనర్ పీవీ జగన్‌మోహన్ పేర్కొన్నారు. తొలుత మనం భారతీయులమని, కులం, మతం అన్నీ తర్వాతేనని ఆయన పేర్కొన్నారు.

ఇళ్లు, మసీదులు, ఆలయాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని వ్యతిరేకిస్తే కల్పించుకునే హక్కు తమకు లేదని, కానీ విద్యాసంస్థలను ప్రజా సంస్థలుగా పరిగణిస్తామని, కాబ్టటి అక్కడ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్ హెచ్చరించారు. కాగా, మదర్సాల్లో జాతీయ గీతాలాపన ఇస్లాంకు విరుద్ధమని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం తమ సొంత మతానుసారం ప్రవర్తించమనే హక్కు తమకు ఇచ్చిందని, కాబట్టి అలానే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో వివాదం చోటుచేసుకుంది.

More Telugu News