: ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదు!: అమెరికాకు చైనా మీడియా హెచ్చరిక

అమెరికా సాంకేతికతను, మేధో సంపత్తిని త‌మ దేశం చోరీ చేసిందంటూ వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్‌ 301 ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్న‌ట్లు తెలిసింద‌ని, ఇదే క‌నుక జ‌రిగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని చైనా డైలీ పత్రిక హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అగ్ర‌రాజ్యం చ‌ర్య చైనా- అమెరికాల మ‌ధ్య‌ మరిన్ని ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు ఇప్ప‌టికే నిల‌క‌డ‌గా లేవని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యం యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉంద‌ని అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకార సంస్థకు చెందిన అధికారి మై జిన్ యూ చెప్పిన‌ట్లు చైనా ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇదేగ‌నుక జ‌రిగితే మేధో సంపత్తి హక్కులకు సంబంధించి ఉద్రిక్తతలు పెరుగుతాయని అందులో రాసుకొచ్చింది. 

More Telugu News