: ‘జై లవ కుశ’పై వదంతులు నమ్మొద్దు : ఎన్టీఆర్ ఆర్ట్స్

బాబీ దర్శకత్వంలో జూనియర్  ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. ‘జై’ ఫస్ట్ లుక్ ఆ తర్వాత, దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న ‘లవ‘ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చిత్ర యూనిట్ పేర్కొనడం తెలిసిందే. అయితే,  ఈ చిత్రం విడుదల తేదీలో మార్పులు జరిగాయనే వదంతులు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘‘జై లవ కుశ’ విడుదల తేదీ గురించి వస్తున్న వదంతులు వాస్తవం కాదు. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ‘లవ’ టీజర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’ అని ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. 

More Telugu News