aravind swami: అరవింద్ స్వామితో రితికా సింగ్ పబ్ సాంగ్!

తెలుగు .. తమిళ భాషల్లో కీలక పాత్రలను చేస్తూ అరవింద్ స్వామి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అవకాశాన్ని బట్టి ఆయన కథానాయకుడిగా కనిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమిళంలో 'వనంగా ముడి' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రితికా సింగ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ప్రస్తుతం చెన్నై లోని ఫిల్మ్ సిటీలో అరవింద్ స్వామి - రితికా సింగ్  లపై పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సాంగ్ చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. నందిత మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సిమ్రాన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోనుంది.         

More Telugu News