: 'గోరఖ్ పూర్ చిన్నారుల మరణమృదంగం'పై విచారణకు సుప్రీం నో!

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ బీఆర్డీ మెడికల్ కళాశాలలో చిన్నారులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంపై సుమోటోగా విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిన్నారుల మరణాలపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయగా, కేసు విచారణను తాము స్వయంగా చేపట్టాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పిటిషనర్లు యూపీ హైకోర్టును ఆశ్రయించవచ్చని, అక్కడే వారి పిటిషన్లు విచారించి, న్యాయమూర్తులు తగు చర్యలు ప్రకటిస్తారన్న నమ్మకం ఉందని పేర్కొంది. సిట్ దర్యాఫ్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని తెలిపింది. కాగా, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతోనే చిన్నారుల మరణాలు సంభవించాయని చెప్పడం వాస్తవ విరుద్ధమని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News