: నెల రోజుల కరెంటు బిల్లు రూ. 38 వేల కోట్లు!

మూడు గదుల ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు లైట్లు, ఓ టీవీ ఉన్న ఇంటికి నెలకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది? మహా అయితే, ఓ 1000 రూపాయల వరకూ రావచ్చు. కానీ, జంషెడ్ పూర్ విద్యుత్ బోర్డు అధికారులు, గుండె గుభిల్లుమనేలా ఏకంగా రూ. 38 వేల కోట్లను ఓ సామాన్యుడి ఇంటికి బిల్లుగా పంపారు. అంతేనా?... ఆ మొత్తం చెల్లించలేదంటూ ఇంటికి కరెంటును కట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతంలో నివసించే బీఆర్ గుహా అనే వ్యక్తికి ఆదివారం నాడు జార్ఖండ్ విద్యుత్ శాఖ ఇంత భారీ మొత్తంలో బిల్లును పంపింది. ఆపై దాన్ని చెల్లించలేదని కనెక్షన్ కట్ చేసింది. ఈ విషయమై గుహా మీడియాతో మాట్లాడుతూ ఇంత మొత్తం బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ, కనీసం ఆ మాత్రం ఆలోచించకుండా అధికారులు కరెంటును కట్ చేశారని ఆరోపించారు. ఈ బిల్లు తనకు షాకిచ్చిందని తెలిపారు. కాగా, రూ. 38 వేల కోట్ల కరెంటు బిల్లుపై పరిశీలిస్తున్నామని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. సాంకేతిక పొరపాటు కారణంగా ఇది వచ్చి వుండవచ్చని అన్నారు.

More Telugu News