naga chaithanya: హ్యాట్రిక్ హిట్ దిశగా చైతూ!

చైతూ కెరియర్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే 'ప్రేమమ్' .. ' రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలతో చైతూకి రెండు హిట్లు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'యుద్ధం శరణం' తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ తోను .. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ తోను నాగ్ చర్చలు జరిపినట్టు సమాచారం.

 ఈ సినిమాతో చైతూకి హ్యాట్రిక్ హిట్ పడాలనే పట్టుదలతో నాగార్జున వున్నారని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున ఆడియో వేడుక పెట్టుకుని, సినిమాను సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నాగ్ ఆశిస్తున్నట్టుగా చైతూకి ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.     

More Telugu News