: ఉత్తర కొరియా కన్నా పాకిస్థాన్ ప్రమాదకరం: సీఐఏ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

అమెరికాపై అణు బాంబులు వేస్తామని నిత్యమూ బెదిరిస్తున్న ఉత్తర కొరియా కన్నా, పాకిస్థాన్ ప్రమాదకరమని యూఎస్ అత్యున్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 'సీబీఎస్ న్యూస్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఉత్తర కొరియా దాడి చేసినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, అయితే, పదేళ్ల క్రితం ఆ దేశపు బలంతో పోలిస్తే మాత్రం కొరియా ఇప్పుడు బలపడిందని అన్నారు.

ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎంతో సంయమనాన్ని పాటిస్తోందని చెప్పిన పాంపియో, కొరియా ముందడుగు వేసినా, అమెరికాకున్న శక్తి ముందు ఆ దేశం ఏమీ చేయలేదన్న సంగతి దేశ ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ ప్రమాదం నుంచి అమెరికాను ఎలా కాపాడుకోవాలో రక్షణ శాఖకు, ఇంటెలిజెన్స్ విభాగానికీ బాగా తెలుసునని తెలిపారు. అమెరికాను బెదిరించాలన్న ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కోరిక తీరబోదని, తమ దేశం ఎన్నడూ భయపడదని తెలిపారు. ఆ దేశం వద్ద అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలిగే శక్తి ఉన్న క్షిపణులు ఎంతమాత్రమూ లేవని, గువామ్ ను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునని అన్నారు.

More Telugu News