allu arjun: మొత్తానికి బన్నీతో కొరటాల మూవీ ఖాయమేనట!

అల్లు అర్జున్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానున్న మాట వాస్తవమే గానీ, అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

 ఆ తరువాత ఆయన లింగుస్వామి .. విక్రమ్ కుమార్ లతో వరుస సినిమాలు చేయనున్నాడు. ఇక కొరటాల విషయానికి వస్తే, ప్రస్తుతం మహేశ్ బాబుతో 'భరత్ అను నేను' అనే సినిమా చేస్తున్న ఆయన, ఆ తరువాత చరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ తో సినిమా కూడా లైన్లోనే ఉందని అంటున్నారు. ఇలా ఈ ఇద్దరూ చేయవలసిన ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, బన్నీ .. కొరటాల సెట్స్ పైకి వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తోంది.  

More Telugu News