: నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు రంగంలోకి దిగిన సైన్యం

నేపాల్, అసోం ను వరదలు ముంచెత్తాయి. అసోంలో వరదల ధాటికి పది మంది మృతి చెందగా, నేపాల్ లో 700 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. అందులో 200 మంది భారతీయులు. విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. భారతీయులను రక్షించేందుకు కదిలింది. సహాయక చర్యలు చేపడుతూ సైనికులు ముందుకు కదులుతున్నారు. కుంభవృష్టికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటికే 55 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో వరదల్లో, కొండల్లో చిక్కుకున్న పర్యాటకులను క్షేమంగా ఇళ్లకు చేర్చే బాధ్యతను సైన్యం తీసుకుంది. 

More Telugu News