: భారత జట్టుకు దొరికిన మరో కపిల్‌దేవ్.. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందన్న ఎమ్మెస్కే

క్రికెట్‌లో దేశానికి తొలి ప్రపంచకప్ సాధించి పెట్టిన లెజెండ్ కపిల్‌దేవ్ తర్వాత టీమిండియాకు అటువంటి ఆటగాడే మరొకడు దొరికాడని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. 1994లో కపిల్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ హార్ధిక్ పాండ్యా రూపంలో ఆల్‌రౌండర్ దొరికాడని ప్రశంసించాడు. శ్రీలంకతో పల్లెకెలెలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పాండ్యా బ్యాటింగ్‌ను వీక్షించిన అనంతరం ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ కోసం ఎదురుచూస్తున్న భారత అభిమానుల నిరీక్షణ నేటితో ఫలించిందన్నాడు. పాండ్యా మరికొంత కాలం క్రికెట్ ఆడగలిగితే కపిల్ అంతటి వాడవుతాడని ఆకాశానికెత్తేశాడు 

More Telugu News