: పెను విషాదం: కొండచరియల కింద రెండు బస్సులు.. 50 మంది సజీవ సమాధి!

హిమాచల్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బస్సులపై హఠాత్తుగా విరిగిపడిన కొండచరియలు 50 మందిని బలితీసుకున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై పధార్ సమీపంలో కోట్‌పురి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 55 మందితో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై ఒక్కసారిగా పెళపెళమంటూ కొండచరియలు విరుచుకుపడ్డాయి. దీంతో బస్సులు నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులోని ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు.

ఇప్పటి వరకు 46 మృతదేహాలను వెలికి తీశారు. 23 మందిని గుర్తించారు. విషయం తెలిసిన ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్లే కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలోని సహాయక చర్యలను ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4 లక్షలు, రవాణా శాఖ నుంచి మరో లక్ష రూపాయలు అందిస్తామని ప్రకటించారు.

More Telugu News