: నోట్ల సైజు, నాణ్యతపై వివరణ ఇచ్చిన ఆర్బీఐ!

కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.500, రూ.2000 నోట్లు వివిధ పరిమాణాలు, డిజైన్లలో ఉన్నాయంటూ పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. నోట్ల నాణ్యత నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని ఆర్బీఐ తెలిపింది. నోట్ల తయారీలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి అత్యున్నత విధానాలను అవలంబిస్తున్నట్టు పేర్కొంది. నిపుణులైన సిబ్బంది, అధునాతన యంత్రాల ద్వారా నోట్ల ముద్రణ జరుగుతోందని తెలిపింది. నాణ్యత విషయంలో ఎలాంటి తేడా ఉండదని చెప్పింది.   

More Telugu News