tamannah: విక్రమ్ సార్ ను మిస్సవుతున్నా: తమన్నా

కొత్త కథానాయికలు దూసుకురావడంతో తెలుగులో తమన్నా హవాకు బ్రేక్ పడిందనే చెప్పాలి. దాంతో ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ స్టార్ హీరో విక్రమ్ తో 'స్కెచ్' అనే మూవీ చేస్తోంది. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది.

 షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకోగా .. తమన్నా పోర్షన్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ .. అందమైన .. అద్భుతమైన జర్నీలా ఈ సినిమా షూటింగ్ కొనసాగిందని చెప్పింది. ఈ సినిమా యూనిట్ తో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుందని అంది. తన పోర్షన్ పూర్తయిపోవడం వలన తాను విక్రమ్ సార్ ను మిస్సవుతున్నానని చెప్పుకొచ్చింది.  

More Telugu News