: యుద్ధమే వస్తే మేము భారత్ వైపే ఉంటాం: యూఎస్ రక్షణ నిపుణుడు హోమెస్

డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్ ఎంతో పరిపక్వత కలిగిన దేశంగా వ్యవహరిస్తుంటే... చైనా మాత్రం పసిపిల్లలా ప్రవర్తిస్తోందని యూఎస్ నావల్ వార్ కాలేజీలో వ్యూహరచనా ప్రొఫెసర్ గా పని చేస్తున్న రక్షణ నిపుణుడు హోమెన్ అన్నారు. ఈ వివాదంలో భారత్ పై చైనా అనవసర కోపాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు. బలీయమైన భారత్ తో వివాదాన్ని కొనసాగించేందుకే చైనా యత్నిస్తోందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా రంగంలోకి దిగినా... ప్రయోజనం ఉంటుందని తాను భావించడం లేదని అన్నారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం భారత్ వైపే అమెరికా ఉంటుందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలనని తెలిపారు.

More Telugu News