: 11 కేసుల్లో చార్జ్ షీట్ సిద్ధం: అకున్ సబర్వాల్

తాము విచారించిన డ్రగ్స్ దందాలో భాగంగా 11 కేసుల్లో చార్జ్ షీట్ లను సిద్ధం చేశామని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగానే కోర్టులో వీటిని దాఖలు చేస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. హైదరాబాద్ లోని ఇఫ్లూ యూనివర్శిటీలో 'డ్రగ్స్ ఫ్రీ నేషన్' పేరిట ఓ కార్యక్రమం జరుగగా, అకున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కేసులో విచారణ ఆగిపోలేదని, పారదర్శకంగా ముందుకు సాగుతోందని వెల్లడించిన ఆయన, తమపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవని అన్నారు.

 రక్త నమూనాలు తీసుకున్న సినీ ప్రముఖుల రిపోర్టులను పరిశీలించిన తరువాత వారిపై చర్యలుంటాయని తెలిపారు. డ్రగ్స్ గురించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే, నిర్భయంగా తమకు అందించాలని సూచించారు. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా నిలిపేందుకు యువతలో మరింత చైతన్యం కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. అన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

More Telugu News