: ఫిలిబిత్‌ను నిద్రకు దూరం చేస్తున్న పులి.. నాలుగు రోజుల్లో ముగ్గురిని పొట్టనపెట్టుకున్న వైనం!

మధ్యప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ పట్టణం పులి భయంతో నిద్రకు దూరమైంది. ఫిలిబిత్ సమీపంలోని భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా తాజగా గురువారం మరో వ్యక్తిని పులి చంపి తినేసింది. గత నాలుగు రోజుల్లో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచే పులి వస్తున్నట్టు భావిస్తున్నారు. తాము పొలంలో పనిచేసుకుంటుండగా ఒక్కసారిగా తండ్రి కున్వర్ సేన్ (45) అరుపులు వినిపించాయని, వెళ్లి చూడగా అప్పటికే పులి తన తండ్రి గొంతు పట్టుకుని ఈడ్చుకుపోతోందని, పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారని గిరీశ్ చంద్ర, హీరాలాల్ సోదరులు తెలిపారు.

గ్రామస్తులను చూసి పులి పారిపోయిందన్నారు. కాగా, పులి దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు పులి భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు బేరి గ్రామ ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందో అని వణికిపోతున్నారు.

More Telugu News