: సైనికులు రేపిస్టులు... కర్ణాటకలో వివాదాస్పద పాఠ్యాంశం!

సైనికులు రేపిస్టులంటూ మంగళూరు విశ్వవిద్యాలయంలో బీసీఏ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంలో పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. మంగళూరు యూనివర్సిటీలో సీనియర్‌ సాహితీవేత్త బరుగూరు రామచంద్రప్ప రచించిన ‘యుద్ధం ఒక పరిశ్రమ’ అనే  అంశాన్ని బీసీఏలో పాఠ్యాంశంలో చేర్చారు. ఇందులో రచయిత సైనికులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఈ పాఠంలో సైనికులను రేపిస్టులుగా అభివర్ణించడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రజా, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వివాదంపై రచయిత మాట్లాడుతూ, ఈ రేపిస్టు అన్న భావజాలం తన సొంతది కాదని, ఒకమిత్రుడు చెప్పిన అంశాల మేరకు తాను దానిని ప్రస్తావించానని అన్నారు. అయినా ఈ పుస్తకాన్ని పరిశీలించి ముద్రించేందుకు ఒక కమిటీ ఉంటుందని, ఆ కమిటీ దానిని పరిశీలించిన తరువాత దానిపై స్పందిస్తానని ఆయన తెలిపారు. సైనికుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News