: నేను డీఎంకేలో చేరాలనుకుంటే 1983లోనే చేరేవాడిని!: కమలహాసన్

డీఎంకేలో చేరే ఉద్దేశం లేదని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ వజ్రోత్సవంలో పాల్గొన్న నేపథ్యంలో డీఎంకేలో చేరనున్నానుంటూ వచ్చిన పుకార్లకు ఆయన సమాధానం ఇస్తూ, "నువ్వు డీఎంకేలో ఎందుకు చేరకూడదు? అంటూ 1983లో కరుణానిధి నాకు టెలిగ్రాం పమపారు. చేరాలనుకుంటే అప్పుడే చేరేవాడిని. నాకు ఆ ఉద్దేశం లేదు. అందుకే ఇప్పటికీ ఆ టెలిగ్రాంకు సమాధానం ఇవ్వలేదు" అని చెప్పారు.

‘‘శివాజీ గణేశన్‌ కు సంభాషణలు రాసింది కరుణానిధి అని తెలుసుకున్నప్పటి నుంచి తాను ఆయనకు వీరాభిమానిగా మారిపోయానని అన్నారు. మన జాతీయ గీతం ‘జనగణమన’లో ద్రావిడం ఉన్నంతవరకు ద్రావిడ భావాలు సుస్థిరంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకాడని భావించిన రజనీకాంత్ కూడా హాజరుకావడం ఆసక్తి రేపింది. 

More Telugu News