rana: ఈ కథ తేజ కన్నా గొప్పగా ఎవరూ రాయలేరు : రానా

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పోస్టర్స్ చూసిన వాళ్లు .. ఇంతకాలానికి రానాకి తగిన పాత్ర దొరికిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా పోస్టర్స్ లో రానా కొత్తగా ... ప్రత్యేకంగా కనిపిస్తున్నాడని అంటున్నారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంగా రానా మాట్లాడాడు. ఈ సినిమాలో తాను వడ్డీ వ్యాపారస్తుడిగా పరిచయమవుతానని అన్నాడు.

 ఆ తరువాత కొన్ని కారణాల వలన రాజకీయాల్లోకి వచ్చి .. తాను చేసిన తప్పొప్పులు ఏమిటనేదే ఈ సినిమా అని చెప్పాడు. తాను కాజల్ పాత్రకిచ్చే ప్రాధాన్యత వలన, కథ ఎక్కువగా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుందని అన్నాడు. ప్రతి పాత్రను దర్శకుడు తేజ అద్భుతంగా మలిచాడని చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథను ఆయన కన్నా గొప్పగా ఎవరూ రాయలేరని అన్నాడు. అందువల్లనే తనకీ .. తండ్రికి .. బాబాయ్ కి ఈ కథ బాగా నచ్చేసిందని చెప్పుకొచ్చాడు. 

More Telugu News