kajal: రకుల్, కాజల్ ఇద్దరూ ఇద్దరే .. సందడి వీరిదే!

సాధారణంగా కొంతమంది కథానాయికలు షూటింగ్ పూర్తి కాగానే .. ఆ సినిమా ప్రమోషన్స్ తో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మరో సినిమా షూటింగులో జాయినైపోతుంటారు. రకుల్ .. కాజల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ చేసే సందడే కనిపిస్తోంది.

రకుల్ చేసిన 'జయ జానకి నాయక' ..  కాజల్ చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని తమ సినిమాల వైపు మళ్లించడానికి ఈ కథానాయికలు ఎవరి స్టైల్లో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా .. ఎలక్ట్రానిక్ మీడియా .. ప్రింట్ మీడియాల ద్వారా తమ సినిమాలపై ఆసక్తిని రేకెత్తించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఇద్దరు భామలు ఈ స్థాయిలో ప్రమోషన్స్ పై చూపుతోన్న ఇంట్రెస్ట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.    

More Telugu News