mahesh babu: 'స్పైడర్' టీజర్ మామూలుగా దూసుకుపోలేదు!

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న 'స్పైడర్' సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. కథలోని వైవిధ్యానికి అద్దం పడుతూ .. భారీతనం ఏ స్థాయిలో ఉందనేది తెలియజెప్పింది. ఈ టీజర్ ను రిలీజ్ చేసిన కొంతసేపటికే టాప్ ట్రెండింగ్స్ లో నిలిచింది. 24 గంటలు గడవక మునుపే అన్ని మాధ్యమాలలోను కలిపి ఈ టీజర్ 8.6 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని రికార్డును సృష్టించింది.

 ఈ సినిమా పట్ల అంతా ఎంతటి ఆసక్తిగా ఉన్నారనేదానికి ఈ వ్యూస్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా, హిందీలోను విడుదల కానుంది. ఈ మూడు భాషల్లోను దర్శకుడిగా మురుగదాస్ కి గల ఇమేజ్ .. మహేశ్ కి గల క్రేజ్ .. రకుల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

More Telugu News