: మేమేమీ గాంధీ బయోపిక్ తీయడం లేదు... ఒక వంచకుడి చరిత్రను సినిమాగా తీస్తున్నాం!: 'సంజయ్ దత్' బయోపిక్ పై రణ్ బీర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను రణ్ బీర్ కపూర్ వంచకుడని సంబోధించడం బీటౌన్ లో కలకలం రేపుతోంది. సంజయ్ దత్ బయోపిక్ లో నటిస్తున్న రణ్ బీర్ కపూర్ ఈ సినిమా గురించి ప్రశ్నించిన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్ దత్ అంత నిజాయతీగా ఉండడం సాధ్యం కాదని అన్నాడు. సంజు బాబాను అభిమానించే వారున్నారు, అలాగే ద్వేషించే వారు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి అడగ్గానే సంజు బాబా నిజాయతీగా తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారని చెప్పాడు. ఆయన నిజంగా చాలా గ్రేట్ అన్నాడు.

 తాను అంత నిజాయతీగా ఉండే వాడిని కాదని చెప్పాడు. ఆయన నిజజీవితం నుంచి ప్రేక్షకులకు ఎంతో కొంత మంచి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నిజాలను నిక్కచ్చిగా చూపిస్తున్నామని చెప్పాడు. దీంతో సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో వివాదాస్పద అంశాలతో పాటు, తాను సాగించిన ప్రేమాయణాలను కూడా చూపించే అవకాశం ఉందని చెబుతున్నాడు. తామేమీ గాంధీ బయోపిక్ తీయడం లేదని, ఒక ఫ్రాడ్ (వంచకుడి) కథను తెరకెక్కిస్తున్నామని అన్నాడు. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, దీనికి సంజయ్ దత్ స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నాడు. 

More Telugu News