Thamanna: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  సినిమాలు చేయడంలో తనకి భాషతో సంబంధం లేదని అంటోంది బ్యూటీ క్వీన్ తమన్నా. "ఒక సినిమా ఒప్పుకునే ముందు కథ బాగుందా? అందులో నా పాత్ర బాగుందా? ఇది చేస్తే నాకెంత పేరు వస్తుంది? అన్నవే చూస్తాను. అంతే తప్ప అది తెలుగా? తమిళమా? హిందీనా? అన్నది చూడను. అందుకే, అన్ని భాషల్లోనూ చేస్తున్నాను" అని చెప్పింది.  
*  అఖిల్ అక్కినేని నటిస్తున్న రెండవ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయడానికి అప్పుడే డేట్ కూడా నిర్ణయించుకున్నారు. ఇక దీనికి టైటిల్ నిర్ణయించే పనిలో చిత్రం యూనిట్ పలు పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తోంది.
*  తమిళ కథానాయకుడు శింబు తన దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంతో వెండితెరపై ఓ ప్రయోగం చేయనున్నాడు. ఈ చిత్రానికి పాటలు, ఇంటర్వెల్ వుండవు. మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనికి మాటలు రాస్తున్నాడు.
*  తాజాగా 'జయ జానకి నాయక' చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేస్తారు. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం మొదలవుతుంది.    

More Telugu News