: ఖతార్ వెళ్లాలనుకుంటున్నారా? వీసాతో పని లేదు...హాయిగా విమానమెక్కి వెళ్లిపోవచ్చు!

ఖతార్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు వీసాతో పని లేదు. నేరుగా ఖతార్ వెళ్లిపోవచ్చు. ముస్లిం దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న ఖతార్ ఇతర దేశాలతో స్నేహబంధం పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌ తో కలిపి 80 దేశాల ప్రజలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతి ఇస్తూ ఖతార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ 80 దేశాల జాబితాలో యూకే, యూఎస్‌, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్ వంటి దేశాలు ఉండడం విశేషం.

ఈ సందర్భంగా ఖతార్ కు చెందిన ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ‘ఇక నుంచి ఖతార్‌ ను సందర్శించేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు. ఖతార్‌ సందర్శనకు వచ్చేవారి కోసం ఎటువంటి రుసుం లేకుండా మల్టీ ఎంట్రీ మినహాయింపును ఇస్తామని తెలిపారు. సందర్శకుడి జాతీయతను బట్టి మినహాయింపు గడువు 180 రోజులా? లేక 90 రోజులా? ఎన్నిరోజులు ఖతార్‌ లో గడపవచ్చు? అన్నది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. ఖతార్‌ ఆతిథ్యం, చారిత్రక సాంస్కృతిని విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. 

More Telugu News