: ముంబైని దిగ్బంధించిన మరాఠాలు... ఆరు లక్షల మందితో భారీ ర్యాలీ

అగ్రకులాలకు చెందిన మరాఠాలు ముంబైని దిగ్బంధించారు. మరాఠా క్రాంతి మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 6 లక్షల మంది మరాఠాలు ముంబైని చుట్టుముట్టారు. దీంతో ముంబైలోని బైకుల్లా నుంచి ఆజాద్ మైదానం వరకు దారితీసిన రహదారులన్నీ కాషాయ రంగుపులుముకున్నాయి. భారీ ఎత్తున కాషాయ జెండాలు చేతబట్టిన మరాఠాలు రిజర్వేషన్ల కోసం మౌన ప్రదర్శన చేశారు. మహారాష్ట్రలో మరాఠా వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అయితే వారు తమకోసం చేసిందేమీ లేదని మరాఠాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కుదించాలని, తమకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 రిజర్వేషన్లు ఉపయోగించుకుని వారంతా బాగుపడిపోతున్నారని, తాము మాత్రం అలాగే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని మరాఠా క్రాంతి మోర్చా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరాఠాల కోసం ప్రతి జిల్లాలో ఒక్కో హాస్టల్ నిర్మించనున్నామని అన్నారు. ఇందుకోసం ఐదు కోట్ల రూపాయలను ఇప్పుడే కేటాయిస్తున్నామని చెప్పారు. అలాగే మరాఠాలకు రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశం ఉందా? అన్నది అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ కు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. 

More Telugu News