: భారత్, చైనాలకు దలైలామా హితబోధ!

డోక్లాం స్టాండాఫ్ నేపథ్యంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో, బౌద్ధ మత గురువు దలైలామా ఇరు దేశాలకు హితబోధ చేశారు. రెండు దేశాలు శాంతిసామరస్యాలతో ఉండాలని, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని సూచించారు. భారత్ లో స్వేచ్ఛ ఉంటుందని... తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే అవకాశం ఇక్కడ ఉంటుందని దలైలామా చెప్పారు. స్వేచ్ఛ లేని ప్రదేశాన్ని తాను ఇష్టపడనని అన్నారు. చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆ దేశ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య విధానాలను అవలంబించాలని సూచించారు. ఎంతో చిన్నదైన తమ టిబెట్ దేశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని చెప్పారు. ప్రజలే నిజమైన పాలకులని... ప్రజలను చైతన్యవంతులను చేయాలంటే మీడియాపై ఆంక్షలు ఉండరాదని అన్నారు.  

More Telugu News