: రెచ్చిపోతే నీ అంతు చూస్తా!: కిమ్ కు ట్రంప్ తాజా హెచ్చరిక

వారానికి ఒక సారి క్షిపణి పరీక్షలు జరుపుతూ, తమ దేశంపై దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ మాట్లాడనంత తీవ్ర స్థాయిలో మాట్లాడిన ఆయన, నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ, రెచ్చిపోతే అంతు చూస్తానని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.

అమెరికా అధీనంలోని ద్వీపంపై అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. కిమ్ ను మంటల్లో కలిపేస్తానని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఒక్క అడుగు వేయాలని చూసినా, అడుగు పడేలోపే ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి తాజాగా ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావించిన ట్రంప్, ఉత్తర కొరియా వాటిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఇకపై కిమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరింతగా విస్తరించినట్లు అయిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News