: కుంబ్లే అకౌంట్ సెటిల్ చేసిన బీసీసీఐ!

టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అకౌంట్ ను బీసీసీఐ సెటిల్ చేసింది. కోచ్ గా సేవలందించిన కుంబ్లేకు రూ. 97.50 లక్షలను చెల్లించినట్టు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. కుంబ్లేకు చెల్లించాల్సింది పెండింగ్ ఉంచకూడా... అతనికి చెల్లించినట్టు చెప్పారు. ప్రొఫెషనల్ ఫీజు కింద మే, జూన్ నెలలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపారు. కుంబ్లేకు ఇక ఎలాంటి బకాయిలు లేవని చెప్పారు. జూన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం హెడ్ కోచ్ పదవి నుంచి కుంబ్లే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవిని చేపట్టాడు. 

More Telugu News