mahesh babu: ఈ నెలాఖరులోనే 'స్పైడర్' సాంగ్ షూటింగ్!

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'స్పైడర్' సినిమా, ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సాంగ్ ను తెరకెక్కించడం పూర్తయితే .. షూటింగ్ పార్టు పూర్తయినట్టే. ఈ సాంగ్ షూటింగును ఈ నెలాఖరులో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

 ప్రస్తుతం మహేశ్ 'భరత్ అను నేను' సినిమా షూటింగులో వున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఈ నెల 11 నుంచి 22 వరకూ లక్నోలో ఉండనున్నాడు. అందువలన ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చాక, 'స్పైడర్' సాంగ్ షూటింగును పెట్టుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ సాంగ్ ను హైదరాబాద్ లో సెట్లో మూడు రోజుల్లో లాగించేస్తారా? విదేశాలకి వెళ్లి వారంలో కానిచ్చేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.    

More Telugu News