: జగన్‌ ప్రతిపక్ష నేత కాదు.. కాలకేయుడు.. వైసీపీ చీఫ్‌పై కొనసాగుతున్న విమర్శలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్ ప్రతిపక్ష నేత కాదని, కాలకేయుడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నంద్యాల స్థానానికి పోటీకి పెట్టినప్పుడే ఆయనేంటో ప్రజలకు అర్థమైందన్నారు. రాజకీయ విలువలు పాటించే ఏ పార్టీ కూడా శాసనసభ్యుడి మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీ పడదని గుర్తు చేశారు.

తండ్రి వయసున్న చంద్రబాబును కాల్చి చంపాలనడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యమనే అమృతంలో జగన్ విషపు చుక్కలా మారాడని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభివర్ణించారు. సీఎంను కాల్చి చంపాలన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అన్న విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే జగన్ నంద్యాలలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీలో తృతీయ శ్రేణి నాయకుల స్థాయికి జగన్ దిగజారిపోయారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విమర్శించారు.

More Telugu News