: చైనాలో భారీ భూకంపం.. వందమందికిపైగా మృతి.. వేలల్లో క్షతగాత్రులు.. సిచుయాన్ అతలాకుతలం!

చైనా చిగురుటాకులా వణికిపోయింది. భూకంపం ధాటికి విలవిల్లాడింది. సిచుయాన్‌ రాష్ట్రంలో సంభవించిన ఈ భూప్రకోపానికి వందమందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ భారీ భూకంపానికి కొద్ది సేపటి ముందు కూడా 3.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు సమాచారం. 2008లో ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపానికి ఏకంగా 70 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. చైనా చరిత్రలో ఇదే అత్యంత విషాదకరమైన భూకంపం. కాగా, శిథిలాల కింద చిక్కుకున్నవారిని సహాయబృందాలు వెలికి తీస్తున్నాయి.

More Telugu News