: చిన్నప్పుడే తల్లిని కోల్పోయా: వెంకయ్య నాయుడు

తాను చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోయాన‌ని, భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న‌కు త‌ల్లిలాంటిద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎంపికైన వెంక‌య్య నాయుడు అన్నారు. ఆయ‌న‌ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేప‌థ్యంలో గ‌తంలో వెంక‌య్య పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, రచనలు, ఉపన్యాసాల సంకలనంతో కూడిన గ్రంథాల ఆవిష్కరణ సభ ఈ రోజు హైదరాబాద్ లో జ‌రిగింది. ‘అలుపెరుగని గళం - విరామమెరుగని పయనం’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సభకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు,  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ.. ప్ర‌పంచం ఆర్థిక మంద‌గ‌మ‌నంలో ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ మాత్రం స్థిరంగా ఉంద‌ని గుర్తు చేశారు.

భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. వాజ్ పేయ్ హ‌యాంలో తాను మంత్రి ప‌ద‌వి వ‌దిలి పార్టీ ప‌ద‌వి చేప‌ట్టాన‌ని తెలిపారు. క‌న్న‌త‌ల్లి, జ‌న్మ‌భూమి, మాతృభూమిని మ‌ర‌చిన వాడు మనిషే కాదని అన్నారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పథంలో న‌డుపుతున్నార‌ని చెప్పారు. 

More Telugu News