rana: రానా కోసమే వెంకటేశ్ ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడట!

వెంకటేశ్ .. సురేశ్ బాబు అన్నదమ్ములుగా ఎంత ఆత్మీయంగా ఉంటారనేది ఇండస్ట్రీలోని వాళ్లందరికీ తెలుసు. ఇక రానాకీ ఒక బాబాయ్ గా కాకుండా ఆయనకి ఒక స్నేహితుడిలా వెంకటేశ్ ఉంటూ వుంటారు. కొన్ని పాత్రల విషయంలో రానా .. వెంకటేశ్ నుంచి సూచనలు .. సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో రానా తాజా చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ సినిమా పై శ్రద్ధ పెట్టింది సురేశ్ బాబు .. రానా మాత్రమే కాదు .. వెంకటేశ్ కూడా. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర వెంకటేశ్ కూర్చున్నారట. ఎక్కడ ఎలాంటి ల్యాగ్స్ లేకుండా .. చాలా షార్ప్ గా కథనం నడిచేలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ఎడిటింగ్ పై అవగాహన .. మంచి పట్టు ఉండటం వలన వెంకటేశ్ పై పూర్తి భరోసాతో రానా వున్నాడని చెబుతున్నారు. త్వరలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.   

More Telugu News