suresh babu: రానా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు: సురేశ్ బాబు

కెరియర్ ఆరంభంలో రానా హీరోగా కొన్ని సినిమాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో ఆయనకి విజయాలను అందించలేకపోయాయి. దాంతో రానా ఆలోచనలో పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లోనే 'బాహుబలి' సినిమాలో రానాకి విలన్ గా ఛాన్స్ వచ్చిందని సురేశ్ బాబు అన్నారు. బాలీవుడ్ లో శత్రుఘ్న సిన్హా .. వినోద్ ఖన్నా కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలనే చేశారు. ఆ తరువాత వాళ్లు చాలా అనూహ్యంగా అగ్రకథానాయకులుగా వెండితెరను ఏలారు.

 ఆ ఆలోచన రావడంతో విలన్ గా రానా తన సత్తా నిరూపించుకున్న తరువాత, హీరోగా స్టార్ డమ్ ను సంపాదించుకోవచ్చని అనుకున్నానని సురేశ్ బాబు చెప్పారు. ఈ కారణంగానే 'బాహుబలి'లో విలన్ పాత్ర చేయమని రానాను ప్రోత్సహించానని అన్నారు. అనుకున్నట్టుగానే 'బాహుబలి'లో విలన్ గా మార్కులు కొట్టేసిన రానా, ఆ క్రేజ్ తో హీరోగా విభిన్నమైన పాత్రలను చేస్తూ తాను ఆశించిన దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు.       

More Telugu News