: బ్యాగేజీ లేక‌పోతే ఇక నిరీక్షించాల్సిన ప‌నిలేదు... దేశంలో మొద‌టిసారి రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఎయిర్‌పోర్ట్ స‌దుపాయం!

విమాన ప్ర‌యాణంలో చెకిన్ బ్యాగేజీ లేక‌పోతే ఇక వ‌రుస‌ల్లో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ విధానాన్ని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ ప్ర‌వేశ‌పెట్టింది. దేశంలో ఇలాంటి స‌దుపాయాన్ని ప్ర‌వేశ పెట్టిన మొద‌టి అంత‌ర్జాతీయ విమానా‌శ్ర‌యం త‌మ‌దేన‌ని జీఎంఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ పేర్కొంది.

దేశీయ ప్ర‌యాణికుల కోసం సెక్యూరిటీ చెక్ సుల‌భ‌త‌రం చేయ‌డానికే ఈ ప‌ద్ధ‌తిని అమ‌లుచేస్తున్న‌ట్లు కంపెనీ తెలియ‌జేసింది. ఈ విధానాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఓపీ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం ఈ విమానా‌శ్ర‌యం గుండా ప్ర‌తిరోజు 18,000 మంది దేశీయ ప్ర‌యాణికులు వెళ్తుంటారు. వీరిలో 40 శాతం మందికి చెకిన్ బ్యాగేజీ ఉండ‌దు. ఈ ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ వ‌ల్ల చెకిన్ బ్యాగేజీ లేని 40 శాతం మంది దేశీయ ప్ర‌యాణికులు లాభ‌ప‌డ‌నున్నారు.

More Telugu News