rakul: సందేహం లేదు .. లవ్ మ్యారేజ్ చేసుకుంటా: రకుల్

రకుల్ తాజా చిత్రంగా ఈ నెల 11వ తేదీన 'జయ జానకి నాయక' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, తన తొలి తెలుగు సినిమా గురించి ప్రస్తావించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో తెలుగు రాని కారణంగా ఏడ్చేశానని చెప్పింది. పట్టుదలతో తెలుగు నేర్చుకుని .. నటనకి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని అంది.

 ఇక ప్రేమ విషయానికి వస్తే .. తనకి ప్రపోజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదనీ, ఒకరిద్దరు ట్రై చేసినా .. తాను పట్టించుకోలేదని చెప్పింది. పెళ్లి విషయానికి వస్తే .. పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా .. ప్రేమించే పెళ్లి చేసుకుంటానని అంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తరువాతనే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని చెప్పింది. మంచి పొడగరి .. భోజన ప్రియుడు .. ముఖ్యంగా సినిమాలంటే ఇష్టం వుండే వ్యక్తిని భర్తగా కోరుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది.   

More Telugu News