: ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నాను...అమ్మాయిలు అంతే!: సినీ నటుడు ప్రిన్స్

ఎనిమిదేళ్లు తాను ప్రేమలో ఉన్నానని సినీ నటుడు ప్రిన్స్ తెలిపాడు. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న ప్రిన్స్ వారం రోజులు బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా అందర్నీ ఆకట్టుకున్నాడు. ముమైత్ హిందీలో మాట్లాడడంతో 50 సార్లు స్విమ్మింగ్ పూల్ లో మునిగి బయటకు వచ్చి క్షమాపణలు కోరాలని శిక్ష విధించగా దానిని అమలు చేసి చూపించాడు. అలాగే తొలి వారంలో షో నుంచి నిష్క్రమించిన జ్యోతి ప్రత్యేక అధికారంతో విధించిన శిక్ష (షోలోని వారందరి బట్టలు ఉతకడం) ని కూడా చాలా నిబద్ధతగా చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఈ సందర్భంగా షోలో తన స్నేహితుడు ఆదర్శ్, అర్చనలతో పిచ్చాపాటి మాట్లాడుతూ, తాను ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నానని చెప్పాడు. అయితే మధ్యమధ్యలో అభిప్రాయభేదాలతో తామిద్దరం దూరమయ్యేవాళ్లమని, మళ్లీ కలిసేవాళ్లమని చెప్పాడు. అయితే తనకు ఇంత వరకు 'ఈ అమ్మాయితో ఉంటే చాలు, జీవితంలో ఇంకేదీ అవసరం లేదనిపించలేద'ని చెప్పాడు. అదే సమయంలో అమ్మాయిలు ప్రేమిస్తే అదేలోకంగా ఉంటారని, ఒక్కసారి బ్రేకప్ అంటే మాత్రం కనీసం అటువైపు కూడా కన్నెత్తి చూడరని ప్రిన్స్ చెప్పాడు. ఈ విషయం చాలా పుస్తకాలు చదివి తెలుసుకున్నానని చెప్పాడు. 

More Telugu News