Priyamani: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  తెలుగు,తమిళ భాషల్లో కథానాయికగా పలు చిత్రాలలో నటించిన ప్రియమణి వివాహం ఈ నెల 23న తన ప్రియుడు ముస్తాఫా రాజ్ తో జరగనుంది. ఆమధ్య వీరి వివాహ నిశ్చితార్థం బెంగళూరులో జరిగిన సంగతి విదితమే.
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వీరిలో నయనతారను ఇప్పటికే ఎంపిక చేయగా, మరో ఇద్దరి ఎంపిక జరుగుతోంది.
*  నాగ్ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'ఏంజల్' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 7న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. బాహుబలి పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో 40 నిమిషాలకి పైగా గ్రాఫిక్స్ ఉంటాయని నిర్మాతలు చెప్పారు.
*  శ్రీకర్ బాబు దర్శకత్వంలో రూపొందిన 'నేను కిడ్నాప్ అయ్యాను' చిత్రానికి సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. కామెడీ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల రెండో వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

More Telugu News