: బీరు ప్రియులారా.. ఈరోజు మీదే!

మద్య పానీయాల్లో ఎన్నో ఉన్నప్పటికీ... బీరుకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బీరును ఆస్వాదిస్తుంటారు. మన దేశంలో కూడా బీరు వినియోగం ఎక్కువగానే ఉంది. బీరు ప్రియులకు ఈ రోజు ఓ ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే... ఈరోజు 'ఇంటర్నేషనల్ బీర్ డే'. 2007 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగస్ట్ 5వ తేదీన జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నుంచి ఆగస్టు నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న ఈవెంట్ గా ప్రారంభమైన ఈ వేడుక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. 50 దేశాల్లో ఈ రోజును జరుపుకుంటున్నారు.

ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే...
1. స్నేహితులంతా కలసి బీర్ ను టేస్ట్ చేయడం.
2. బీరు తయారీకి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం.
3. అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.

బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు. బీరు తయారీదారులకు, టెక్నీషియన్స్ కు, బార్ టెండర్స్ కు ధన్యవాదాలు తెలుపుతారు. బీర్ డేను జరుపుకుంటున్న దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం. 

More Telugu News