: టెస్ట్ డబుల్ సాధించిన ఫాస్టెస్ట్ క్రికెటర్ గా అశ్విన్ ఘనత!

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. అత్యంత వేగంగా టెస్ట్ డబుల్ సాధించిన క్రికెటర్ గా అవతరించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సిక్సర్ ద్వారా అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు అశ్విన్. దీంతో టెస్టుల్లో 11 హాఫ్ సెంచరీని సాధించడమే కాక, 2 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో, టెస్టుల్లో 2004 పరుగులు సాధించిన అశ్విన్ ఖాతాలో ఇప్పటికే 279 వికెట్లు ఉన్నాయి. దీంతో అశ్విన్ టెస్ట్ డబుల్ సాధించాడు.

టెస్టుల్లో 2 వేల పరుగులు సాధించి, 250 వికెట్లు తీసిన నాలుగో ఇండియన్ క్రికెటర్ గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు ఉన్నారు. కేవలం 51 మ్యాచ్ లలోనే కుంబ్లే టెస్ట్ డబుల్ సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్లు రిచర్డ్ హ్యాడ్లీ (54), ఇమ్రాన్ ఖాన్ (55), ఇయాన్ బోతమ్ (55)లను అశ్విన్ అధిగమించాడు. తద్వారా అతి తక్కువ మ్యాచ్ లలో టెస్ట్ డబుల్ సాధించిన క్రికెటర్ గా అవతరించాడు.  

More Telugu News