: వినూత్న రీతిలో యూపీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం!

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా రేపే వెల్లడి కానున్నాయి. ఆగస్టు 10వ తేదీతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున వెంకయ్యనాయుడు, యూపీఏ కూటమి తరపున గోపాలకృష్ణగాంధీలు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు వెంకయ్యకే ఎక్కువగా ఉన్నాయి.

 ఎలక్టోరల్ కాలేజేలోని 787 ఓట్లలో వెంకయ్యకు 488 ఓట్లు కచ్చితంగా పడనున్నాయి. అయితే, పలు పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తుండటంతో వెంకయ్యకు పడే ఓట్ల సంఖ్య 587 వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు, గోపాలకృష్ణగాంధీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతూ, అన్ని పార్టీల ఎంపీలకు పోస్ట్ కార్డులను పంపారు. 

More Telugu News