: దుబాయ్ స్కూళ్లలో ఈ 11 రకాల ఆహారపదార్థాలపై నిషేధం!

దుబాయ్ 11 రకాల ఆహారపదార్థాలపై నిషేధం విధించింది. దుబాయ్ లో చాలామంది పిల్లలు స్థూలకాయం (ఒబేసిటీ) తో బాధపడుతున్నారు. భవిష్యత్ తరాలు బాల్యంలోనే ఇబ్బందులపాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన దుబాయ్ ప్రభుత్వం. బాలల్లో స్థూల కాయానికి కారణం గుర్తించింది. రోజులోని మూడు పూటల్లో రెండు పూటలు స్కూల్ లోనే భోజనం చేసే పిల్లల్లో ఈ సమస్యను నివారించేందుకు నడుం బిగించింది. దీంతో 11 రకాల ఆహార పదార్థాలు స్కూళ్లలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే...
* ఎనర్జీ డ్రింక్స్
* అన్ని రకాల పండ్ల రసాలు
* కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసే పాలు, పెరుగు
* చూయింగ్ గమ్, కాండీస్
* బోఫక్ (స్పెషల్ చిప్స్)
* అధిక చక్కెరను కలిగిన రంగురంగుల స్వీట్లు
* ప్లెయిన్ చాకోలెట్
* మోనోసోడియం గ్లుటేమేట్‌ ను కలిగిన ఆహార పదార్థాలు.. టొమాటోతో చేసేవి, జున్ను వంటివి..  
* కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
* చిప్స్
* అన్ని రకాల సాఫ్ట్‌ డ్రింక్‌ లు
వీటన్నింటినీ దుబాయ్ లోని స్కూళ్లలో విక్రయించకూడదని, అందుబాటులో ఉంచకూడదని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా పిల్లలు ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

More Telugu News