: కళ్లుండి కూడా చూడలేనివారికి ఏం కనిపిస్తుంది?: మంత్రి ఈటల

అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని... తమ ఉనికిని చాటుకోవడానికి ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే, వారు ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కళ్లుండి కూడా చూడలేనివారికి తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని అన్నారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో మెడికల్ కాలేజీల మంజూరుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కరీంనగర్ లో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని... దీంతో, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఎంసీఐ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం దీక్ష చేయాలనుకున్న పొన్నం ప్రభాకర్ ఆనాడే ఎందుకు చేయలేదని మండిపడ్డారు.

కరీంనగర్ లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్ఎస్... ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయినా దాని ఊసే ఎత్తడం లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ రేపటి నుంచి నిరాహార దీక్షకు దిగనున్నారు. అయితే, ఈయన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

More Telugu News