: అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోంది!: చైనా మీడియా ప్రశంసలు

ఓపక్క సరిహద్దులో డోక్లామ్ వివాదం రేగిన నాటి నుంచి చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ సరిహద్దులో వేడిని రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ ను చైనా ప్రశంసల్లో ముంచెత్తింది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈమేరకు ఓ వ్యాసాన్ని ప్రచురించింది. భారత్ అన్ని రంగాలలోను అభివృద్ధిని సాధిస్తూ, అద్భుతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అందులో పేర్కొంది.

భారతీయ యువపారిశ్రామిక వేత్తలు సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధికి దోహదం చేస్తున్నారని ప్రశంసించింది. భారత్ లో జనాభా అధికంగా ఉంటుందని, పేదరికం ఎక్కువగా ఉంటుందని చైనీయులు భావిస్తుంటారని, అందుకు భిన్నంగా జరుగుతున్న అభివృద్ధి అంశాన్ని కూడా గుర్తించాలని చెప్పింది. భారత్ లో బిలియనీర్లు పెరుగుతున్నారని పేర్కొంది. విధానపరమైన నిర్ణయాలను చైనా త్వరగా తీసుకుంటుందని, భారత్ లో నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం అవుతుందని చైనా మీడియా పేర్కొంది.

More Telugu News