nithin: క్లారిటీ వచ్చేసింది .. 'లై' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు!

నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మేఘా ఆకాశ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఇదే రోజున 'జయ జానకి నాయక' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఉండటంతో, 'లై' వాయిదా పడే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి.

 దాంతో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర స్పందిస్తూ, తమ సినిమా విడుదల వాయిదా పడటం లేదని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 5వ తేదీన, హైదరాబాద్ - జెఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది.

More Telugu News