: కోహ్లీ అవుట్...మూడు వికెట్లు కోల్పోయి ఆచి తూచి ఆడుతున్న టీమిండియా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరోసారి స్వల్ప స్కోరుకే లంక బౌలర్లు పెవిలియన్ పంపారు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (35), కేఎల్ రాహుల్ (57) శుభారంభం ఇచ్చారు. ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెరీరా బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం పుజారాతో జతకలిసిన రాహుల్ ఆచితూచి ఆడాడు. ఆ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అనంతరం సమన్వయలోపంతో రన్ అవుట్ గా వెనుదిరిగాడు.

దీంతో పుజారాకు జత కలిసిన కోహ్లీ (13) తొలి టెస్టులో సెంచరీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో క్రీజులో అడుగుపెట్టాడు. అయితే 39వ ఓవర్ ఐదవ బంతిని ఆఫ్ స్టంప్ అవతల సంధించిన హెరాత్ అద్భుత ఫలితం రాబట్టాడు. బంతి మిడ్ వికెట్ మీదకు తిరిగే ప్రమాదం ఉందని బావించిన కోహ్లీ డిఫెన్స్ ఆడబోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ లో ఉన్న మాధ్యూస్ చేతిలో ఒదిగిపోయింది. దీంతో మూడో వికెట్ గా కోహ్లీ పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారా (45) కు రహానే (7) జతకలిశాడు. వీరిద్దరూ ఆచి తూచి ఆడుతున్నారు. దీంతో టీమిండియా 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో హెరాత్, పెరీరా చెరొక వికెట్ తీశారు. 

More Telugu News